పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

- Advertisement -

పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్

Padi Kaushik Reddy effigy burning

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  సోమాజిగూడ కార్పొరేటర్ మనం సంగీత యాదవ్, కాంగ్రెస్ నాయకులు

శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానంపై వ్యాఖ్యలు చేసే అర్హత  కౌశిక్ లేదని మండిపడ్డారు. గత ఎన్నికల్లో భార్య

పిల్లలను అడ్డుపెట్టుకొని గెలిచిన నువ్వు బీసీ నేతను విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు. దానం జోలికి వస్తే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. మీ పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు

ఇతర పార్టీల నేతలను ఎలా విమర్శిస్తారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఎస్సీ ఎస్టీ, బీసీ ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular