- Advertisement -
దుబ్బ మల్లన్న జాతరలో పాల్గొన్న పాడి కౌశిక్ రెడ్డి..
Padi Kaushik Reddy participated in the Dubba Mallanna fair.
జమ్మికుంట
జమ్మికుంట పట్టణం ధర్మారంలో సోమవారం రోజు జరిగిన దుబ్బ మల్లిఖార్జున స్వామి వారి జాతరలో హుజురాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతరలో నిర్వహించిన మల్లన్న స్వామి కళ్యాణమోత్సవ కార్యక్రమంలో పాల్గొని, భక్తులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి, మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులతో హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
జాతర ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



