Wednesday, February 18, 2026

రెండుగా పాకిస్తాన్

- Advertisement -

రెండుగా పాకిస్తాన్
లాహోరం, ఫిబ్రవరి 18,(వాయిస్ టుడే )

Pakistan in two
మన పొరుగు దేశం పాకిస్తాన్‌ మళ్లీ రెండు ముక్కలు కాబోతోందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. దశాబ్దాలుగా పాకిస్తాన్‌ నుంచి విభజన పోరాటం చేస్తున్న బలూచిస్తాన్‌.. పాకిస్తాన్‌ నుంచి విడిపోవడం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్తాన్‌ మంత్రి చట్టసభలో మనము.. వాళ్లు అని చెప్పడం 1971 బంగ్లాదేశ్‌ విడిపోయినప్పుడు వాడిన పదాలను గుర్తు చేస్తోంది. ఈ పరిణామాలు బలూచ్‌ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) 1 నిమిషం 10 సెకన్ల వీడియోలో పాకిస్తాన్‌ సైనికులు జీమీల్, షమ్స్తబ్రేజ్‌లను చూపించింది. వీరిని 7 రోజుల్లో విడుదల చేయకపోతే చంపేస్తామని హెచ్చరించారు. 5 వేల అత్యాధునిక డ్రోన్లతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌పై దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,184 మంది పాక్‌ సైనికులు మరణించారు.బలూచిస్తాన్‌ సీఎం అక్తర్‌ మెంగల్‌ 15 రోజుల క్రితం రాజీనామా చేసి, ‘ఇక పాకిస్తాన్‌లో ఉండదు‘ అని ప్రకటించారు. 1947లో ఖాన్‌ ఆఫ్‌ కలాట్‌తో ఒప్పందం ఉల్లంఘించి, 1950లో బలూచిస్తాన్‌ను బలవంతంగా కలిపారు. 1958లో నవాబ్‌ నవరోజ్‌ ఖాన్‌ తిరుగుబాటు చేసి అరెస్టు చేయబడ్డాడు. 2006లో నవాబ్‌ అక్బర్‌ బుగ్తి హత్యకు దారి తీసింది. ఇలా పాకిస్తాన్‌ బలూచిస్తాన్‌ను మోసం చేసింది. దీంతో బలూచ్‌ ప్రజలు పాకిస్తాన్‌ను విశ్వసించడం లేదు.
2002లో చైనా–పాక్‌ ఆర్థిక మార్గం (సీపీఈసీ) ప్రకటించడం బలూచ్‌లలో కోపాన్ని మేల్కొలిపింది. ఇప్పుడు బీఎల్‌ఏ ఆపరేషన్‌ హెరాఫ్‌ 2.0లో భారత సరిహద్దు యాంటీ–డ్రోన్‌ టెక్నాలజీతో దాడి చేస్తోంది. భవిష్యత్‌లో పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.బలూచ్‌ నాయకులు ‘పాకిస్తాన్‌ ఆక్రమణ‘ అని పిలుస్తున్నారు. మెంగల్‌ ‘ప్రభుత్వ అధికారం ఏ ఇంచ్‌ లేకుండా పోయింది‘ అన్నారు. ఈ ఘటనలు 1971 బంగ్లాదేశ్‌ సారాంశాన్ని పునరావృతం చేస్తూ, పాక్‌కు కీలక సవాలుగా మారాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్