హైదరాబాద్: ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి మంగళవారం నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి లాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ వెస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేసి టీఎస్పిఎస్సీ లో జరిగిన అవకతవకలును పేపర్ లీకేజీ చేసిన అధికారులను కాపాడుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబం మరియు గత ప్రభుత్వంనిది. ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మాట మేరకు టీఎస్పిఎస్సీ పై రివ్యూ చేసిన జనార్ధన్ రెడ్డి ని వివరణ ఇవాలి అని ఆదేశాలు ఇస్తే, భయంతో రాజ్ భవన్ కి వెళ్ళి తన రాజీనామా లేఖను ఇచ్చారు. విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన జనార్ధన్ రెడ్డి రాజీనామాతో సిటీ సెంట్రల్ లైబ్రరీలో డాక్టర్ వెంకట్ బాల్మూరి గారితో పాటు నిరుద్యోగులు పాలాభిషేకం చేసి ధన్యవాదములు తెలియచేశారు.