ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం.
Palabhishekam to portraits of Chief Minister Revanth Reddy and Minister Sridhar Babu.
గోదావరిఖని:
ఎస్‌సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం, బాణాసంచా కాల్చి సీట్లు పంపిణీ,
విషయ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా దళితుల జీవితాల్లో చీకటి తొలగిన రోజు దళిత జీవితాల వర్గీకరణ ద్వారా వెలుగులు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కి, రామగుండం శాసనసభ్యులు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.
అనంతరం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మహంకాళి స్వామి హాజరై మాట్లాడుతూ గత 30 సంవత్సరాల పోరాటం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగదేనని వారు కొనియాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బిల్లును ఆమోదించడం జరిగింది. వర్గీకరణ దేశంలోనే మొట్టమొదటిసారిగా చేసిన రాష్ట్రంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దక్కుతుంది. ఎస్‌సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అని, దశాబ్దాలుగా వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని వారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు