- Advertisement -
అహుడా ఛైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన పల్లె
Palle congratulated the chairman of Ahuda
అనంతపురం
అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నాడు అనంతపురంలోని అహుడా ఆఫీస్ లోని తన ఛాంబర్ లో టీసీ వరుణ్ ప్రమాణ స్వీకారం చేసి చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అనంతపురంలోని అహుడా ఆఫీస్ లో వరుణ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, చిన్న వయస్సులో టీసీ వరుణ్ పడిన కష్టానికి తగిన ఫలితమే ఈ అహుడా పదవి వచ్చింది. జన సేన పార్టీకి, కూటమి పార్టీల అభ్యర్థుల విజయానికి టి సి వరుణ్ ఎనలేని కృషి చేశారు. కూటమి ప్రభుత్వం వరుణ్ ను గుర్తించి నామినేటెడ్ పదవి అప్పగించింది. చిన్న వయస్సులో ఈ పదవికి వన్నె తెస్తారని ఆశీస్తున్నానని అన్నారు.
- Advertisement -