- Advertisement -
పవన్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయినట్టేనా
Pawan has entered the ground
అమరావతి, నవంబర్ 6, (వాయిస్ టుడే)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలకు ముందు తరహా రాజకీయాలను ప్రారంభించినట్లే కనపడుతుంది. ఫుల్లు ఎఫెన్స్ లో కనపడుతున్నారు. నిన్నటి వరకూ తన పని ఏదో తాను చూసుకుంటూ పవన్ కల్యాణ్ పెద్దగా బయటకు కనిపించలేదు. ఆయన తనకు కేటాయించిన శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలను ఆయన పూర్తిగా అధ్యయనం చేశారు. అధికారులతో సమీక్షలు, ఉత్తర్వులకే పరిమితమైన పవన్ కల్యాణ్ నేడు గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. వచ్చీ రావడంతోనే ఇటు కూటమి ప్రభుత్వంపైనా, అటు విపక్షంపైనా విరుచుకుపడుతూ వెళ్లడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో ఉంటున్న టీడీపీ నేత చేతిలో ఉన్న హోంశాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖను సరిగా నిర్వహించడంలేదంటూ మండిపడ్డారు. వంగలపూడి అనిత నుంచి తాను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూటమి పార్టీల నేతల వరకూ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఏకిపారేశారు. నిజానికి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై అసంతృప్తి ఉంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేరుగా చెప్పవచ్చు. లేదంటే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించవచ్చు. కానీ పవన్ అలా చేయలేదు. జనం సమక్షంలో హాట్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు కూటమిలో ఏదో జరుగుతుందన్న అనుమానాలను లేవనెత్తారు.ఇక పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించాల్సి ఉన్నప్పటికీ మరుసటి రోజు పల్నాడు ప్రాంతానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించిన సరస్వతీ పవర్ భూములను సందర్శించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అన్యాక్రాంతమైన భూముల విషయాలను పవన్ ప్రస్తావించారు. పేదల భూములను జగన్ బలంవంతంగా సొంతం చేసుకున్నారంటూ మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత ఈ కంపెనీకి భూముల లీజును యాభై ఏళ్ల పాటు పొడిగించుకున్నారన్నారు. కోడెల శివప్రసాద్ ను ఫర్నిచర్ కోసం వేధించి నాటి ప్రభుత్వం చంపేసిందంటూ పల్నాడు పర్యటనలో వ్యాఖ్యానించారు. భూములు లాక్కున్న వారికి సరస్వతీ పవర్స్ లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ రైతుల వద్ద ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ చీఫ్ మినస్టర్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఇలా ఆవేశంగా మాట్లాడటం.. తన, తరతమ బేధల్లేకుండా మాట్లాడుతుండటం రాజకీయంగా చర్చకు దారితీసింది. అసలు పవన్ కల్యాణ్ మనస్సులో ఏముందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. 2027 నాటికి తాను కీలకంగా మారాలని పవన్ భావిస్తున్నారా? అన్న అనుమానం మాత్రం కూటమి పార్టీల్లోనూ బయలుదేరింది. ఢిల్లీ నుంచి ఏదైనా సిగ్నల్స్ అందాయా? అన్న చర్చకూడా ఏపీ పాలిటిక్స్ లో జరుగుతుంది. పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు మౌనంగా ఉండి, చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించి కొంచెం ఇమేజ్ తగ్గడంతో తిరిగి దానిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. మొత్తం మీద గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్, పర్యటిస్తున్న తీరు అనేక అంశాలకు చర్చనీయాంశంగా మారింది.
డిఫెన్స్ లో అనిత
హోంమంత్రి పదవి అంటే నిజంగా కత్తిమీద సాము వంటిది. ఎవరికైనా అంతే. ఆపదవిలో ఉన్నవారికి ఏ పార్టీలో అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా పవర్స్ ఉండవు. హోంమంత్రి అంటే కేవలం విమర్శలు చేయించుకోవడానికే ఆ పదవి చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు కీలక నేతలు హోంశాఖను హ్యాండిల్ చేస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూడా ఇద్దరు మహిళ హోంమంత్రులు పనిచేశారు. మేకతోటి సుచరిత కొన్నాళ్ల పాటు హోంమంత్రిగా పనిచేయగా, తానేటి వనిత ఇంకొన్నాళ్లు పనిచేశారు. కానీ ఇద్దరు కేవలం సంతకం చేయడానికి మాత్రమే ఆ సీట్లో కూర్చునే వారు. ముఖ్య నిర్ణయాలన్నీ నాటి సీఎంవో నుంచి వచ్చేవంటారు. నిజానికి వంగలపూడి అనిత హోం మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత వరకూ యాక్టివ్ గానే ఉన్నారు. అనితకు పూర్తి స్థాయి అధికారాలు ఉండవని అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ కు కూడా తెలియంది కాదు. ప్రధానమైన పోస్టింగ్ ల విషయంలో హోంమంత్రి ప్రమేయం తక్కువగానే ఉంటుంది. సాంకేతికంగానే ఎవరున్నా పదవిలో ఉంటారు తప్పించి..ఆ శాఖలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి తీసుకుంటుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రధానమైనది కనుక ముఖ్యమంత్రి నిరంత పర్యవేక్షణలోనే హోంశాఖ ఉంటుంది. డీజీపీ స్థాయి అధికారులు కూడా ఏదైనా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాతనే తీసుకుంటారన్నది కాదనలేని వాస్తవం.కానీ విమర్శలకు వచ్చేసరికి హోంమంత్రి బలయిపోతుంటారు. ఇప్పుడు వంగలపూడి అనిత కూడా. నిజానికి గత కొద్దిరోజుల నుంచి ఏపీలో శాంతిభద్రతల సమస్యకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, కొన్ని చోట్ల మహిళలపై అత్యాచారాలు జరిగాయి. పిఠాపురంలోనూ ఒక యువతిపై అత్యాచారం జరిగింది. ఆ కేసులో నిందితుడిపై సరైన చర్యలు తీసుకోలేదన్నది పవన్ కల్యాణ్ ఆగ్రహంగా తెలుస్తోంది. దానికి హోంశాఖను బాధ్యులను చేస్తూ ఆయన మాట్లాడారు. హోంమంత్రి పనితీరును తప్పుపట్టే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. కానీ హోం మంత్రి ఏ విషయంలోనూ ఏ నిర్ణయంలోనూ పెద్దగా ప్రమేయం ఉండదన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలియంది కాదు. . పవన్ కల్యాణ్ వంగలపూడి అనితపై ఆయన నేరుగా వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఆమెకు వెనువెంటనే పదవీ గండం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే టీడీపీ నుంచి ఆమె గెలిచి చంద్రబాబు ఇచ్చిన పదవి కావడంతో ముఖ్యమంత్రికి అన్ని విషయాలు తెలుసు. వంగలపూడి అనిత తప్పు ఏమీ లేదని కూడా తెలుసు. అందుకే అనిత పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా.. ఆమె తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. విపక్ష నేతలకు కూడా హోం మంత్రిత్వ శాఖపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పటికీ చివరకు ప్రభుత్వంపై బురద జల్లాలంటే ఈ శాఖ ఒక్కటే కనిపిస్తుంది. అందుకే హోంశాఖ ఎంత వపర్ ఫుల్ అయినదో.. అంత చికాకు తెప్పించే శాఖ అని అనితకు ఇప్పుడు అర్థమయి ఉండాలి.
- Advertisement -