ట్రెండింగ్ లో పవన్….

- Advertisement -

ట్రెండింగ్ లో పవన్….

Pawan in trending....

విజయవాడ, డిసెంబర్ 13, (వాయిస్ టుడే)
పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే తెలుగు సినీ ఇండస్ట్రీ, ఏపీ రాజకీయాలు షేక్ అవుతాయి. తాజాగా పవన్ పేరుతో గూగుల్ సెర్చ్ ట్రెండ్ మారుమోగుతోంది. ఏపీ, తెలంగాణ, ఇండియానే కాదు.. ఇతర దేశాల్లోనూ పవన్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ప్రకారం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కొందరు వ్యక్తుల గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు. నటులకు సంబంధించి అమెరికన్ హాస్యనటుడు మైకా కాట్ విలియమ్స్ తర్వాత పవన్ నిలిచారు.ఏపీ ఎన్నికల సమయంలో పవన్ చేసిన ప్రచారం, మేలో డిప్యూటీ సీఎంగా ఆయన నియామకం సందర్భంలో.. భారతదేశం, నేపాల్, కువైట్, యూఏఈ, ఖతార్‌లలో ఎక్కువమంది పవన్ గురించి సెర్చ్ చేశారు. ఇటీవల కాకినాడ ఓడరేవును సందర్శించినప్పుడు ఆయన చేసిన సీజ్ ద షిప్.. కామెంట్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది.ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టా, తెలంగాణలోని భద్రాచలం ప్రాంతాల్లో పవన్ గురించి ఎక్కుమంది సెర్చ్ చేశారు. ముఖ్యంగా పవన్ అప్ కమింగ్ మూవీ హరి హర వీర మల్లు టీజర్ విడుదల సందర్భంగా ఎక్కువమంది సెర్చ్ చేశారు.పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక.. ‘పవన్ కళ్యాణ్ పోర్ట్‌ఫోలియో’ ఏంటని గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ జరిగింది. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం.. పీకే మంత్రిత్వ శాఖకు సంబంధించి అత్యధికంగా శోధించారు.ఇండియాలో వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, హార్దిక్ పాండ్యా గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. వారి తర్వాత పవన్ కళ్యాణ్ గురించే గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ జరగడం విశేషం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular