పిఠాపురంలో ఇంటివాడవుతున్న పవన్ !

- Advertisement -

పిఠాపురంలో ఇంటివాడవుతున్న పవన్ !
పిఠాపురం
ఎక్కడ్నుంచో ఇక్కడకొచ్చి ఏం చేస్తాడులే,నాన్ లోకల్ మనిషి అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై సాగుతూన్న ప్రచారా నికి తెరదింపే పరిస్థితులు కనిపిస్తూ న్నాయి.ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే..అయి తే.,కాకినాడజిల్లా పిఠాపురం నియో జకవర్గంలోనే నివాసం ఏర్పరచుకుని, ఉగాదినాడు నూతన గృహప్రవేశం చేసి,ఇక ఇక్కడ్నుంచే పార్టీ కార్యకలా పాలు,ప్రచారాలు సాగించేలా పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేయనున్నట్లు సమాచారం.పిఠాపురం నియోజకవర్గం లోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవేకి ఆనుకుని ఒక రైతు కొత్తగా నిర్మించిన భవనాన్నే పవన్ కళ్యాణ్ తాను నివాసంగా ఏర్పరచుకోనున్నట్లు తెలుస్తోంది.సుమారు రెండెకరాల విశాలమైన స్థలంలో,మీటింగ్ హాళ్ళు, కిచెన్,సినిమా ధియేటర్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు,కొత్త హంగులు,ఆ ర్భాటాలతో మూడు అంతస్థులతో ఆ భవనాన్ని రైతు ఓదూరి నాగేశ్వరరావు నిర్మించారు.ఈ కొత్త భవనంలోనే నివాసం ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఉగాదినాడు గృహప్రవేశమై,ఉగాది వేడుకలుకూడా ఆ నివాసంలోనే చేసుకోనున్నారు.ఇక్కడ్నుంచే పార్టీ కార్యకలాపాలు,రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగించనున్నారని వినికిడి.అందుకు హెలిపాడ్ ను కూడా ఆ నివాస భవనంవద్ద ఏర్పర్చారు.పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఆప్తులు అని,ఆయన అద్దె ఇవ్వాల్సివస్తే ఒక్క రూపాయి ఇచ్చినా తనకు సంతోషమేనని,పవన్ కళ్యాణ్ ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఉండాలనుకున్నా తనకు ఇష్టమేనని ఆ భవన యజమానియైన రైతు ఓదూరి నాగేశ్వరరావు చెప్తూన్నారు.దీన్నిబట్టి ఒకవేళ ఎనికల్లో పవన్ కళ్యాణ్ నెగ్గినా.,ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండరనే ప్రచారానికి తెరదించినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular