Friday, February 13, 2026

పిఠాపురం ఆడపడుచులకు  పవన్ కళ్యాణ్  పసుపు, కుంకుమ, చీర కానుక

- Advertisement -

పిఠాపురం ఆడపడుచులకు  పవన్ కళ్యాణ్  పసుపు, కుంకుమ, చీర కానుక

Pawan Kalyan gifted yellow, saffron and sarees to the girls of Pithapuram.

పురూహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
పవన్ కళ్యాణ్ రి తరఫున చీరలు అందచేసిన  నాగబాబు  సతీమణి  పద్మజ,శాసనమండలి సభ్యులు  పిడుగు హరిప్రసాద్
శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక శాసనసభ్యులు, ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చులతో పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందచేశారు. పవన్ కళ్యాణ్  తరఫున ఆయన వదిన, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నాగబాబు  సతీమణి పద్మజ,, శాసన మండలి సభ్యులు  పిడుగు హరిప్రసాద్  వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందజేశారు. పద్మజ  ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, బొట్టు పెట్టి మరీ సారె అందచేశారు.
అనంతరం సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాలు ప్రారంభించారు. పిఠాపురం ఆడపడుచులతో కలసి  పద్మజ  వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో ఘనంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల నేపధ్యంలో ఉదయం 5 గంటల నుంచే పురూహూతిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. వందాలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్దలతో వ్రతమాచరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మూడు బ్యాచులుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి  భవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్