అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan will participate in the assembly election campaign
అమరావతి: నవంబర్12
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16, 17న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్డీఏ తరఫున మహారాష్ట్రలోప్రచారంలో పాల్గొననున్నారు.
ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కల్యాణ్‌తో పాటే ఉంటారు.బీజేపీ పెద్దలఆహ్వానం మేరకు వారు మహా రాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.ఆ రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు ఆ ఇద్దరు నేతలు అందుబాటులో ఉండకపోవచ్చు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికిసమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తి స్తున్నాయి. ఇప్పటికే మ్యానిఫెస్టోలు కూడ విడుదల చేశాయి. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోవేచి చూడాలి మరి?