రేపు తెలంగాణలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

హైదరాబాద్:నవంబర్ 21: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రేపు బుధవారం వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు.ఈ నెల 26న అమిత్‌షాతో కలిసి పవన్‌ హైదరాబాద్‌లో ప్రచారం చేస్తారు.

పొత్తులో భాగంగా ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్.. ప్రచారం పార్టీకి కలిసివస్తుందని కాషాయపార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా.పవన్ కల్యాణ్ వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో రోడ్ షో చేయనున్నారు.

నెలాఖరులో తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు వరకూ తెలంగాణలోనే మకాం వేయడం ద్వారా బీజేపీ కేడర్‌లో జోష్‌ నింపనున్నారు

మోదీ.. ఇప్పటికే పలు సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. తెలంగాణలో బీజేపీని గెలిపించాలంటూ కోరారు…..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular