Sunday, December 22, 2024

 ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్

- Advertisement -

 ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్
కాకినాడ, జూన్ 17,
శాఖల కేటాయింపులో టీడీపీ మిత్రధర్మాన్ని పాటించింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమైన శాఖలు కేటాయించడంతో పాటు, అదే పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు కీలకమైన పౌరసరఫరాల శాఖను అప్పగించింది. జనసేనకు సినీరంగంతో ఉన్న సంబంధాలు, పవన్‌ సినీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. జనసేనానికి హోంశాఖ, ఆర్థిక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ  ప్రజావసరాలు, పార్టీ బలోపేతంపై ద‌ృష్టిపెట్టిన ఆయన ప్రజలతో మమేకమయ్యే శాఖలనే ఏరికోరి ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా జనసేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే కొనసాగనున్నారు. జగన్ పాలనలో నలుగురు ఉపముఖ్యమంత్రులు ఉండే వారు. అయితే ఈ సారి పార్టీలో ఎంత మంది సీనియర్లు ఉన్నా  జనసేనానిని ఒక్కరినే డిప్యూటీ సీఎంగా నియమించి  ఆయన ఎంత స్పెషలో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కోరుకున్నట్టుగానే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణం, శాస్త్రసాంకేతిక శాఖల్ని అప్పగించారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను టీడీపీకి చెందిన సీనియర్‌ మంత్రికి ఇవ్వాలని మొదట అనుకున్నారు. పవన్‌ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆయనకే కేటాయించారు. తనకు ప్రత్యేక గుర్తింపు, సముచిత గౌరవం దక్కేలా తనను మాత్రమే ఉపముఖ్యమంత్రిని చేసి, కీలకశాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్‌ అభిమతాన్ని తెలుసుకున్న చంద్రబాబు దానికి తగ్గట్టుగానే ఆయనకు సముచిత ప్రాధాన్యత కల్పించారు. సీఎం తర్వాత ఎక్కువ శాఖలు పవన్ కల్యాణ్ వద్ద ఉండటంతో సచివాలయంలోని అతిపెద్ద చాంబర్ ను ఆయనకు కేటాయించనున్నారు. ఓఎస్డీలు, సెక్రటరీలు, ఇతర అధికారులకు అనుకూలంగా ఉండేలా ఆయన ఛాంబర్ సిద్ధమవుతోంది.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నా.. ఈ దఫా పవన్‌ ఒక్కరినే ఉపముఖ్యమంత్రిని చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ప్రత్యేక ఆసక్తి దృష్ట్యా ఆ శాఖను ఏరికోరి తీసుకున్నారు. ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఆ లక్ష్యంలో భాగంగానే అటవీ, పర్యావరణ శాఖను ఆయన ఎంచుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కల్యాణ్‌దే కీ రోల్.. దీంతో కేబినెట్‌లో జనసేనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు.. కీలకమైన శాఖలను జనసేనకు కేటాయించారు. అందులో పవన్‌ కల్యాణ్‌ స్థాయిని ఏ మాత్రం తగ్గించకుండా డిప్యూటీ సీఎంతో పాటుగా మొత్తం ఆరు శాఖలు ఇచ్చారు. అలాగే జనసేన సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ప్రాధాన్యత ఉన్నపౌరసరఫరాల శాఖను అప్పగించారు.. జనసేనకు సినీరంగంతో ఉన్న అనుబంధం, పవన్ సినీ నేపధ్యన్ని దృష్టిలో పెట్టుకున్ని ఆ పార్టీ కోరిక మేరకు కందుల దుర్గేష్‌కు పర్యటకం, సినిమాటోగ్రఫీ శాకను కేటాయించారు.వాస్తవానికి పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు హోం శాఖ ఇస్తారనే ప్రచారం జరిగింది. కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉన్నాకూడా పవన్‌కల్యాణే వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేరు. ఎందుకంటే హోం, ఆర్థిక శాఖల్లో మంత్రిగా ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. అదే పంచాయతీ, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖలైతే ప్రజలతో మమేకం అయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది. అందుకే పట్టుబట్టి మరీ పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలను పవన్ తీసుకున్నారు. ఇక పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖలను కూడా ఆయన అడిగి తీసుకున్నారు.తమ పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లేందుకే పవన్‌ కల్యాణ్‌ ఈ శాఖలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రామీణ ప్రజలతో నేరుగా అనుబంధం కలిగి ఉండే పోర్ట్‌ఫోలియోలనే తీసుకున్నారన్న చర్చ జరుగుతుంది. పాలనలో తన పవర్ ఎలా చూపిస్తారో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్