Sunday, September 8, 2024

ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి ఈటల రాజేందర్

- Advertisement -
Pay dues to employeesEtala Rajender
Pay dues to employees
Etala Rajender

ఖమ్మం
నగరంలోని శ్రీశ్రీ హోటల్లో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ హజరయ్యారు. అయనను పార్టీ నేతలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  తాండ్ర వినోద్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గోన్నారు.  ఈటల మాట్లాడుతూ  2 7 వ తేదీన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి నీ దింపాం. ఆర్టీసీ ఉద్యోగులు తమని నాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిన నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీ నీ దివాల తీసే ప్రయత్నం చేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు నిరుద్యోగ యువతకు 4 వేలు ఇస్తా అని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఇవ్వలేదు. ఓట్లు అడిగేముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 డీఏ లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. ఉద్యోగులను అరచేతిలో బెల్లం పెట్టీ మోచేతి వరకు ప్రభుత్వం నాకించారు. ఉద్యోగులకు ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించాలని అన్నారు.
ఈహెచ్ఎస్ కింద ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. మంత్రులు స్కూల్, కాలేజీ యాజమాన్యాలతో సమావేశాలు పెట్టీ ఓట్లు వేయాలని బలవంతం చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు . ఎన్నికల సమయంలో మీకు అండగా ఉన్నవారికి జీతాలు ఇవ్వకుండా ఉండటం సమంజసం కాదు. జీవో నెంబర్ 317 విషయంలో కేసిఆర్ ను తప్పు పట్టాం, నేడు ఉద్యోగుల మీద లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితి వుంది. ఈ ప్రభుత్వం అతి కొద్ది కాలంలో ప్రజలతో చీ కొట్టించుకున్న ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ప్రతి నెలకు ప్రతి మహిళకు 8 వేల భృతి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చింది. చట్టసభలు నిలదీస్తే బీజేపీ నే, నేడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు. రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యపై అయిన కొట్లాడే పార్టీ బీజేపీ. అందుకు బీజేపీ ఎమ్మెల్సి అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్