కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లించండి

- Advertisement -

కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లించండి

యూనియన్ జిల్లా నేత జయప్రకాశ్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ స్కీమ్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల 4నాలుగు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి జోగుళాంబ గద్వాల్ జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ తెలిపారు. గత నాలుగు నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారని అప్పులు చేసుకొని విధులకు హాజరవుతున్నారు అని ఆయన ఆన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం తో తెలంగాణ రాష్ట్రం లో 17384మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. గత నాలుగు నెలలుగా జీతాలు లేక పేద,మధ్యతరగతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయకపోవడం వల్లనే వీరి జీతాలు ఆగిపోయాయని ఆయన తెలిపారు. నేషనల్ హెల్త్ స్కీమ్ క్రింద కాంట్రాక్టు, పద్ధతిన మెడికల్ ఆఫీసర్స్ 685, ఏ ఎన్ ఎమ్ లు 1182, డి ఇ ఓ లు 637, నర్స్ ప్రాక్టీస్ నర్ మిడ్ వైవ్స్ 322, ఆయుష్ ఫార్మసిస్ట్ 268, సెకండ్ ఏ ఎన్ ఎమ్ లు 4000, ఆయుష్ సపోర్ట్ స్టాఫ్ 325, స్టాఫ్ నర్సెస్ 2708, అడ్మినిస్ట్రేటర్ స్టాఫ్ 394, ఫైనాన్స్ 94, సపోర్ట్ స్టాఫ్ 1418, పారా మెడికల్ 749, లాబ్ టెక్నీషియన్ 585, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 315,ఎమ్ ఎల్ హెచ్ పి ఆండ్ సి హెచ్ ఓ 2953, స్పెషలిస్ట్ 300, ఫార్మసీ స్ట్ 111వివిధ విభాగాలలో 17384మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహులు స్పందించి పెండింగ్ ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ విజ్ఞప్తి చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular