చంద్రబాబుకు ఊరట

- Advertisement -

విజయవాడ, అక్టోబరు 11: స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 33 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే, స్కిల్‌ స్కామ్‌ కేసుతో పాటు.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసులు సైతం చంద్రబాబును వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో పలు కేసుల్లో విచారణ నిమిత్తం సీఐడీ పీటీ వారెంట్‌ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, చంద్రబాబు సైతం ఈ కేసుల్లో ముందస్తూ బెయిల్ కోరుతూ.. హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. వీటిపై గత కొన్ని రోజులుగా న్యాయస్థానాలలో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు ఐఆర్‌ఆర్, అంగళ్లు కేసుల్లో తాత్కాలిక ఊరట లభించింది. ఐఆర్‌ఆర్‌ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంగళ్లు కేసులో రేపటివరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు పేర్కొంది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్లో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ.. ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది.హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై విచారణను ఏసీబీ కోర్టుల వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన రైట్‌ టు ఆడియన్స్‌ పిటిషన్‌ సైతం డిస్మిస్‌ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అనంతరం .. ఫైబర్‌నెట్‌ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇరువైపులా వాదనలను న్యాయాధికారి వింటున్నారు.సోమవారం వరకు పీటీ వారెంట్స్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించిందని చంద్రబాబు తరపున లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఫైబర్ కేసులో విచారణ కొనసాగుతుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular