చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 1, (వాయిస్ టుడే):  చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా, కంటి నిండా నిద్రపోయినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్  అంచనాపైనా ఆయన స్పందించారు. ‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. డిసెంబర్ 3న విడుదలయ్యే అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి.’ అని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని సదరు సంస్థలు అంచనా వేశాయి.

Peaceful sleep after long days
Peaceful sleep after long days
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular