ఐక్యరాజ్యసమితి సమావేశా ల్లో భారత ప్రతినిధిగా పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
పెద్దపల్లి
Peddapalli MP Vamsi Krishna to represent India at UN meetings
ఐక్యరాజ్యసమితి సమావేశా ల్లో భారతదేశం తరపున పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ప్రాతినిధ్యం వహించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం లో భారత ప్రతినిధి బృందంతో కలిసి పాల్గొన్నారు. ఇందులో సీనియర్ పార్లమెంటరీ నేతల నేతృత్వంలో భారత శాశ్వత మిషన్ వద్ద వివిధ అంతర్జాతీ య సమావేశాలు, ద్వైపాక్షిక చర్చలు, థీమ్ ఆధారిత చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వేదికపై భారత ప్రజాస్వామ్య విలువలు, సంభాషణ, సమానత్వం, సహకార భావనలను ప్రతిబింభించేలా తెలియజెప్పారు. ఈ సందర్శనలో ప్రధానమైన అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పు, శుద్ధ శక్తి వనరుల సమాన ప్రాప్తి, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టి, ప్రపంచ శాంతి, భద్రత రక్షణ సహకారంపై చర్చినట్లు తెలిపారు. భారతదేశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణమన్నారు. మన దేశ శాంతి, సమానత్వం, విద్య, స్థిరమైన అభివృద్ధి పట్ల అంకితభావంతో ముందుకు సాగుతుందన్నారు. ఓకే ప్రపంచమంతా వసూదైక కుటుంబంలా ఉండాలనే దృక్పథంతో భారతదేశం ప్రపంచ ఐక్యతకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దశాబ్ద కాలం తర్వాత భారత పార్లమెంట్ నుండి మల్టీ-పార్టీ ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడం చారిత్రాత్మక పరిణామంగా భావించబడుతోందని అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్య బలాన్ని, తెలంగాణ ప్రజల గర్వాన్ని, పెద్దపల్లి ప్రతినిధి పాత్రను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పిన ఘనత తనకు దక్కడం గర్వంగా భావిస్తున్న ట్లు ఎంపీ వంశీకృష్ణ మీడియా కు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు.


