Sunday, September 8, 2024

టిటిడి మఠాల భూములను పెద్దిరెడ్డే ఆక్రమించాడు

- Advertisement -

టిటిడి మఠాల భూములను పెద్దిరెడ్డే ఆక్రమించాడు
మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి
అమరావతి జూలై 16

Peddiredde encroached upon the lands of the TTD monasteries

గత ఐదేళ్లలో వైసిపి నేతలు భారీ భూదోపిడీకి పాల్పడ్డారని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో భూదోపిడీలో వైసిపి మంత్రులు, ఎంఎల్‌ఎలు కీలక పాత్ర పోషించారని, వైసిపి మాజీ ఎంఎల్‌ఎలు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాల్లోనే మూడ వేల ఎకరాలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. టిటిడి మఠాల భూములను పెద్దిరెడ్డి కుటుంబం వదల్లేదని, చట్టపరంగా విచారణ జరిపి త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామన స్పష్టం చేశారు. ఇప్పటికే రెవెన్యూ, దేవాదాయ అధికారులు విచారణ ముమ్మరం చేశారని, ఎపిలో ఉన్న గ్రానైట్ కొండలన్నీ పెద్దిరెడ్డే హస్తగతం చేసుకున్నారని, తమ భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు చేసే కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు. భూములు, ఇసుక, మైనింగ్ దోపిడీకి పాల్పడిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. మైనింగ్ శాఖలో అవినీతిపై ఇప్పటికే విచారణ జరుగుతోందన్నారు.ఆర్‌టిసి నుంచి ఎలక్ట్రిక బస్సులు నడిపేందుకు సంస్థలతో చర్చిస్తున్నామని, గత ఐదేళ్లలో ఆర్‌టిసిని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని రామ్ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాగానే 200 వరకు కొత్త బస్సులు రోడ్డెక్కాయని, మరో 1200 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయని వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్