21.2 C
New York
Friday, May 31, 2024

బీటలు వారిన కొండమీద పల్లెలు కదిలిన కంచు కోటల పీఠాలు

- Advertisement -

బీటలు వారిన కొండమీద పల్లెలు కదిలిన కంచు కోటల పీఠాలు

కొండమీద పల్లెల్ల నుంచి బీసీ జనార్దన్ రెడ్డి కి మద్దతుగా టీడీపీలో చేరిక

కొండమీద పల్లెలకు బీటలు

బానిసత్వం వదిలి ప్రజాస్వామ్యంలోకి రమ్మని బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

కొలిమిగుండ్ల,
బనగానపల్లె తెలుగుదేశం కార్యాలయంలో చేరికల కార్యక్రమంలో  అవుకు మండలంలోని కొండమీద పల్లెల్లో ఒక్కటైనా కొండమనాయని పల్లె బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా టీడీపీలో చేరడం జరిగింది.  టీడీపీ నాయకులు నాగిరెడ్డి, శివ రెడ్డి ఆధ్వర్యంలో  రవి నాయక్, కోనేటి పెద్దన్న, నోస్సాం మోహన్, నోస్సాం రామకృష్ణ, హనుమాన్ నాయక్, శివుడు నాయక్, నాగరాజు, నారాయణ స్వామి, శంకర్, చిన్న బాల సుంకన్న, మారేడుమడుగుల శ్రీరాముల యాదవ్, రాజశేఖర్ యాదవ్, మల్లేష్ యాదవ్, నాగేంద్ర యాదవ్, హనుమ నాయక్,  కోనేటి శ్రీనివాసులు, కావేటి భాస్కర్, నోస్సాం రమేష్, పెనుగొండ శ్రీను, సుబ్బయ్య, బోయ చంద్ర, బోయ సుంకన్న, బోయ దస్తగిరి, బోయ కిట్టు, బోయ రామాంజనేయులు, బోయ విష్ణు, పడమటి పెద్దన్న, కలింగిరి లింగమయ్య, కుళాయి తదితర కుటుంబాల వైసీపీ కీలక నేతలు  బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. వారికి బీసీ జనార్దన్ రెడ్డి మరియు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు.
బీసీ జనార్దన్ రెడ్డి  మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎవరో ఒక నాయకుడు చెప్తే ఆ నాయకుడి కన్నుసన్నుల్లో బ్రతికారు, మీకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఈ అధిపథ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా నలిగి పోయే గ్రామాలు ఉన్నాయి అంటే అవి అవుకు మండలం లోని 3 కొండ మీద పల్లెలు, క్రింద ఉన్న 3 గ్రామాలు, ఓటు వేసే హక్కు మీకు ఉంటుంది, మీకు వేసేకునే స్వాతంత్ర కూడా కల్పించకుండా వాళ్ళుకు ఇష్టం వచ్చినట్టు వారికి వేపించేవాళ్ళు, పార్టీలో చేరిన వారందరికీ  ఏ కష్టం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు స్వతంత్రం రావాలి, మీరు నాయకులు అవ్వాలి, మీకు గౌరవం రావాలి, పార్టీ లో చేరిన అందరికి సముచిత స్థానం కల్పిస్తానని, ఈ 20 రోజులు సమిష్టిగా పని చేసి, ఈ సైకో పాలనకు అంతం పలికి,  బనగానపల్లె గడ్డపై పసుపు జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జనార్థన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!