కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలో గాజులరామారం చంద్ర గిరి నగర్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ జరిగింది. బిఆర్ యస్ పార్టీని సాగనంపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈటెల అన్నారు.. బిజెపి కార్నర్ మీటింగ్ కు వివిధ బస్తీల నుండి, కాలనీల నుండి ప్రజలు హాజరై కెసిఆర్ పాలన పోవాలని కోరుకుంటున్నారని బిజెపి నాయకుడు ఈటెల అన్నారు. డబల్ బెడ్ రూంలు, రేషన్ కార్డులు , నిరుద్యోగులకు నౌఖరిలు లేక పోవడం ప్రజలందరూ బిఆర్ యస్ ఓడించడానికి సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు.. ఎన్నికల ప్రచారం లో భాగంగా కుత్బుల్లాపూర్ చంద్రగిరి నగర్ లో అభ్యర్థి శ్రీశైలం తో కలసి ప్రచారం లో పాల్గొన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఒక్కో నియోజికవర్గంలో 100 కోట్లు పంచి గెలవాలని కేసీఆర్ డబ్బులు పంపుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని నమ్మకం లేదు. కేసీఆర్ కు దెగ్గరగా ఉండి ఆయన చేసిన అరాచకాలు చూసిన మనిషి నేనని అన్నారు .



