అరాచక వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు
People sang the death knell to the anarchic YCP regime
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెల్లడి
పిడుగురాళ్ల,
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ, ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అరాచకమైన వైసీపీ పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన సంవత్సరం 2024 అన్నారు. అలువుగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పతనానికి తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రం గా తయారుచేసి మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడీ దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన చేసి ఉండరని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారన్నారు. మూడు పార్టీల కలయికతో రాష్ట్ర అభివృద్ధి కావాలని 175 సీట్లు గాను 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారన్నారు. గత ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ గుంతల మయమయ్యాయని నేడు కొన్ని వందల కోట్లు వెచ్చించి గుంతలు లేని రహదారులు తయారయ్యాయని అలాగే మన నియోజకవర్గంలో కూడా 16 కోట్లుతో రహదారులకు మరమ్మతులు చేశామన్నారు. గత రెండు రోజుల క్రితం వై ఎస్ ఆర్ సి పి విద్యుత్ ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేయడం చూసామని, అసలు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి ఈ నిరసనలు చేసే హక్కు ఈ వైఎస్ఆర్ సీపీ నాయకులకు లేదని ఈ సందర్భంగా యరపతినేని ప్రశ్నించారు. ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంకా బుద్ధి రాలేదని, సోషల్ మీడియాలో కూడా వికృతమైన చేష్టలతో పలు రకాల పోస్టులు పెడుతున్నారని వాటి నుండి బయటికి రాకపోతే భవిష్యత్తులో దారుణమైన పరిస్థితి ఎదుర్కొనవలసి ఉంటుంది అని అన్నారు. అలాగే గురుజాల నియోజవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని వీటన్నిటిపై విజిలెన్స్ ఎంక్వయిరీ జరుగుతుందని త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.