సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
People should be vigilant to avoid cyber crime.
ఎస్పి అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల
కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్ లింక్స్ ఏపీకె మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
పోలీస్ యూనిఫామ్ తో ఎవరైనా వీడియో కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే స్పందించకండి.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం,సైబర్ నేరాలకు గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయండి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తతే ప్రధాన ఆయుధం అని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయలని జిల్లా ఎస్పీ తెలిపారు.
మొబైల్ ఫోన్ కి ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ లకు,కొత్త నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నందున వాటి పట్ల స్పందించవద్దు, సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, ఫ్లీస్ చేయడానికి విభిన్నమైన కార్యనిర్వహణతో బయటకు వస్తున్నారని, వాటిని కట్టడికి అప్రమత్తత, అవగాహనే ఆయుధం అని తెలిపారు.
పోలీస్ యూనిఫాంతో ఎవరైనా వీడియో కాల్స్ చేస్తే కంగారు పడొద్దని, డిజిటల్ అరెస్ట్ అంటూ దబాయిస్తే స్పందించవద్దని, కేంద్ర దర్యాప్తు సంస్థలు,పోలీసుల పేరుతో వచ్చే కాల్స్ పట్ల జాగ్రత వహించలని, అసలు డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేనే లేదు అట్టి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల తీయని మాటల వలలో పడి వ్యక్తిగత విషయాలు, ఫోటోలు అస్సలు ఇవ్వవద్దని, వ్యక్తి గత విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటుగా ఉండవద్దని ,సోషల్ మీడియా అకౌంట్స్ కి తప్పని సరిగా ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని, సోషల్ మీడియా వేధికాకగా వేధిస్తే తక్షణమే పోలీస్ వారిని స్పందించాలని తెలిపారు.
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.
లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.