ఘనంగా పెంపుడు కుక్క ” ఘన ” బర్త్ డే వేడుకలు
Pet dog "Ghan" celebrates his birthday in grand style
జంతువులను ప్రేమించడమే కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా చేర్చుకొని మొదటి జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా తూప్రాన్ లో ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నేటి సమాజంలో ఒకరికి ఒకరు తోడు నీడగా ప్రేమమయా జీవితం గడిపే రోజులు అంతరించిపోతున్న సమయంలో ఏకంగా తమ పెంపుడు కుక్క కు “ఘనా” అని నామకరణం చేయడమే గాకుండా దాని ఆలనా పాలన చూస్తూ ఏడాది నిండిన కారణంగా ఘనా యజమాని తూప్రాన్ కు చెందిన గూడూరి శేఖర్ గౌడ్, శిరీషలు దంపతులు జులై 1నాడు వారి దగ్గరి బంధుమిత్రులను ఆహ్వానించి మొదటి సంవత్సర జన్మదిన వేడుకలు ఘనా కు నూతన వస్త్రాలు ధరించి, కళ్ళజోడు పెట్టీ బర్త్ డే కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పెంపుడు జంతువు అయిన ఘనా ను తమ పిల్లలతో సమానంగా పెంచి పోషిస్తున్నామని పేర్కొన్నారు. ఏ లోటు రాకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి స్నాన పానాదులు, బోజన సదుపాయాలు కల్పించి ఉత్తమ శిక్షణ అందించి జన్మదినం సందర్భంగా గూడూరి శేఖర్ గౌడ్, శిరీష లు ఆశీర్వదించి దీవించామన్నారు.



