మండలంలో విద్యారంగ అభివృద్ధికి తగుచర్యలు తీసుకోవాలంటూ కర్నూలు ఎంపీకి ఏఐఎస్ఎఫ్ నేతల వినతిపత్రం
Petition of AISF leaders to Kurnool MP to take appropriate steps for development of education sector in mandal
డిఎన్టి హాస్టల్ పునః ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి
మండలంలో మోడల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేయాలి
బీసీ బాలికల వసతి గృహ ఏర్పాటు చేయాలి
:దేవనకొండ జనవరి 4
మండలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ఒక చర్యలు తీసుకుని విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు మధు, భాస్కర్ లు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం దేవనకొండ కు వచ్చిన ఎంపీ పంచలింగాల బస్తిపాటి నాగరాజును ఏఐఎస్ఎఫ్ మండల ప్రతినిధి బృందం కలిసి విద్యారంగ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ… మండలంలో విద్యారంగ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మండలoలోని 44 గ్రామాలకు కేంద్రబిందువైన దేవనకొండ నందు హాస్టల్ వసతి లేక విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే దుస్థితి దాపురించిందని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో మోడల్ స్కూల్ ఉన్నప్పటికీ దేవనకొండలో ఇప్పటివరకు మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేయలేదన్నారు. మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తే మెరుగైన విద్య ఇక్కడ ప్రాంత పేద విద్యార్థులకు అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.మండలంలో బాలిక విద్య ప్రోత్సహించడంలో భాగంగా బీసీ బాలికల వసతిగృహాన్ని ఏర్పాటు చేసి బాలిక విద్యకు పెద్దపీట వేయాలన్నారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా దేవనకొండ మండలం విద్యాభివృద్ధిలో చాలా వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారము లో ఉన్న కూటమి ప్రభుత్వం దేవనకొండ మండల విద్యారంగ అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని మండలంలో డిఎన్టి హాస్టల్ పునఃప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే మండలంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, బీసీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా యువకులు, విద్యార్థులు, వయోజన వృద్ధులు వారి అవసరార్థం క్రీడా ప్రాంగణo కోసం స్థలం కేటాయించాలని వారు ఎంపీని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సురేంద్ర, రవితేజ, రవీంద్ర, భరత్, తేజ, నాగరాజు, వీరేంద్ర, సుధాకర్, రఫీ, శంకర్, రామంజి తదితరులు పాల్గొన్నారు.