జనసేన పార్టీకి గాజుగ్లాస్ గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.. ఇప్పటికే గాజుగ్లాస్ సింబల్‌ను ఫ్రీ సింబల్‌గా పెట్టింది కేంద్ర ఎన్నికల కమిషన్..
అయితే, గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అసలు గాజు గ్లాస్ జనసేనకు దక్కుతుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది.. అయితే, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అదే గుర్తుపై జనసేన పార్టీ పోటీ చేసింది.. ఈ ఎన్నికల్లోనూ తమకు అదే గుర్తుకావాలని కోరుతోంది..మరోవైపు, రాష్ట్రంలోని తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ప్రాంతీయ పార్టీలుగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ రెండు పార్టీలకు సింబల్స్ కేటాయించింది.. కానీ, జనసేన పార్టీకి మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు దక్కలేదు.. రిజిస్టర్డ్ పార్టీగానే పరిగణిస్తోంది ఈసీ.. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు గుర్తును కేటాయించిన విషయం విదితమే కాగా.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం విదితమే. రెండు స్థానాలు మినహా.. తాను పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన.