Sunday, September 8, 2024

టైడీ కొనుగోలును ప్రకటించిన ఫెనోమ్

- Advertisement -

ప్రపంచవ్యాప్త విస్తరణలో భాగంగా టైడీ కొనుగోలును ప్రకటించిన ఫెనోమ్
హైదరాబాద్, జూలై 2
ఉద్యోగులకు హైర్ నుండి రిటైర్ వరకు అసాధారణమైన ప్రీ-బోర్డింగ్ మరియు ఆన్‌బోర్డింగ్ అనుభవాలను అందించడంపై దృష్టి సారించిన మానవ వనరుల సాంకేతిక సంస్థ టైడీని కొనుగోలు చేస్తున్నట్లు ఫెనోమ్ ఈరోజు ప్రకటించింది. ఈ ఐదో స్వాధీనం మరియు ఇంటెలి జెంట్ టాలెంట్ ఎక్స్‌ పీరియన్స్ ప్లాట్‌ఫామ్ పోర్ట్‌ ఫోలియోకు ఈ అదనపు జోడింపు ఉద్యోగులకు ఉత్పాద కత కోసం సన్నద్ధమయ్యే సమయాన్ని తగ్గించడానికి ఫెనోమ్ కు గల విజన్ ను బలపరుస్తుంది. అదే స మయంలో హెచ్ ఆర్ ప్రాక్టీషనర్స్ కు సమర్థవంతమైన అనుభవాలను అందిస్తుంది. ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్ నుండి సృష్టిస్తుంది.ఈ స్వాధీనం గురించి ఫెనోమ్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు మహే బైరెడ్డి మాట్లాడుతూ, “టైడీ చేరికతో, మేం ఆయా సంస్థల ఉద్యోగులు మొదటి నుండి ఉత్పాదకతను కలిగి ఉండేలా సంస్థలకు సాధికారికత అం దించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆన్‌బోర్డింగ్ అనేది టాలెంట్ జర్నీలో కీలకమైన సందర్భం. ఇక్కడ అభ్యర్థులు ఉద్యోగులుగా మారుతారు మరియు ప్రతిభ గల నాయకులు వారిని విజయం సాధించేందుకు నియమిం చుకోవచ్చు. టైడీతో మేం అద్భుతమైన ఎండ్-టు-ఎండ్ టాలెంట్ అనుభవాన్ని సృష్టించడానికి అభ్యర్థులు,  ఉద్యోగుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాం. ఉద్యోగి  మొదటి రోజు ముందు వరకు అవసర మైన కార్యాచరణ దశలు, ధృవీకరణలు, డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతిభా వంతులను పొందడానికి తోడ్పడుతుంది. ప్రతిభ నిర్వహణ బృందాల కీలకమైన అవసరాలను ఇది పరిష్క రిస్తుంది. ఇది ఉద్యోగులపై శాశ్వతమైన, సానుకూల ప్రభావాన్ని చూపేలా కొత్త నియామకాలకు సంబంధిం చి వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన అనుభవాన్ని సృష్టిస్తూ ఉత్పాదకతకు సమయాన్ని తగ్గిస్తుంది’’ అని అన్నారు.టైడీ ప్రారంభమైనప్పటి నుండి, ప్రతి ఒక్కరికీ పని సజావుగా సాగాలని మేం కోరుకున్నాం” అని టైడీ సహ వ్యవస్థాపకుడు కిరణ్ మీనన్ అన్నారు. “వ్యక్తిగత-ఆధారిత విభజన, ఇంటిగ్రేషన్‌లు, ఆటోమేషన్,  ఇంటెలి జెన్స్‌ ను ఒకే పరిష్కారంగా కలపడం ద్వారా ఆన్‌బోర్డింగ్ అనుభవాలు, సంక్లిష్ట హెచ్ఆర్  కార్యకలాపాల ను మెరుగుపరచడానికి అవకాశం ఉందని మేం గ్రహించాం. పరిశ్రమలో అత్యుత్తమ నియామకం, వృద్ధి, మ రియు రిటెన్షన్ ఫలితాలను అందించడానికి టైడీ సాంకేతికత, వర్క్‌ ఫ్లోలు ఫెనామ్  సమగ్ర విధానంలో కీల కాంశంగా మారుతాయని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్