కొత్తగూడెంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఎంపీ వద్దిరాజు

- Advertisement -

కొత్తగూడెంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం
ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం

Pink flag is sure to fly in Kothagudem
MP Vaddiraju
కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేసారు.  బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని,అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని, ఇంతకుముందు కూడా ఈ మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ తమ పార్టీకి చెందినవారేనని చెప్పారు.ఎంపీ రవిచంద్ర బుధవారం తనను కలిసిన ఒక టీవీ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ, ధర్మం-అధర్మానికి జరుగుతున్న పోరులో తప్పకుండా ధర్మమే గెలుస్తుందన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చనందున బడుగు బలహీన వర్గాల వారంతా కాంగ్రెస్ పాలకులపై మండిపడుతున్నారన్నారు.వృద్ధులు,దివ్యాంగుల పింఛన్లు పెంచలేదని,రైతుబంధు సక్రమంగా ఇవ్వట్లేదని, నిరుద్యోగ యువతకు,కౌలు రైతులకు చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కారని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.మాజీ మంత్రి హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని వెతికి తీయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,ఆయన కుటుంబ సభ్యులకు వరుసగా నోటీసులిచ్చి “డైవర్షన్ పాలిటిక్స్”చేస్తున్నారని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ సర్కార్ పనితీరును చూసి తాము నష్టపోయ్యిందేమిటో ప్రజలు బాగా అర్థం చేసుకోవడం జరిగిందని ఎంపీ రవిచంద్ర వివరించారు.కొత్తగూడెంతో పాటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా సాగుతున్నదని,అన్ని చోట్లా కూడా గులాబీ జెండా రెపరెపలాడడం తథ్యమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular