రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకం 16వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 28న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పీఎం కిసాన్ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగిఉండాలి. అలాగే, ఇ-కేవైసీ చేసి ఉండాలి.
ఒకవేళ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్నా, పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా
https://pmkisan.gov.in/
లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, పీఎం కిసాన్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 155261/011-24300606 హెల్ప్‌లైన్లను సంప్రదించొచ్చు…
పీఎం కిసాన్ నిధులు
- Advertisement -
- Advertisement -



