పోచారం శ్రీనివాసరెడ్డి విజయం.. ఆనవాయితీకి అడ్డుకట్ట

- Advertisement -

నిజామబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థి సాధించారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న ఆయన బాన్సువాడ నుంచి గెలుపొంది గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. గతంలో స్పీకర్‌గా పనిచేసిన వారు.. తదుపరి ఎన్నికల్లో గెలుపొందిన సందర్భాలు లేవు. తాజాగా పోచారం గెలుపొంది.. ఆ ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు.
గతంలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాదెండ్ల మనోహర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు ఓటమి చవిచూశారు. దీంతో 2018లో భారాస అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో కేసీఆర్‌.. పోచారం శ్రీనివాసరెడ్డిని ఒప్పించి సభాపతిగా నియమించారు. ప్రస్తుతం పోచారం గెలుపుతో పాత ఆనవాయితీకి అడ్డుకట్ట వేసినట్లయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular