పుట్ట మధు పై అర్ధరహిత విమర్శలు మానుకోవాలి
కాంగ్రెస్ నాయకులకు బీ. ఆర్. ఎస్ నాయకుల హితవు
కమాన్ పూర్
Pointless criticism on Putta Madhu should be avoided
నిన్నటి దాకా.. అంటే శాసన సభ ఎన్నికలకు ముందు… ఆ తర్వాత కూడ బీ. ఆర్. ఎస్ పార్టీలో ఉండి పుట్ట మధు కమాన్ పూర్ మండలంతో పాటు మంథని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి, బీ. ఆర్. ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి గురించి పదే పదే చెప్పిన నాయకులే నేడు పుట్ట మధు ఏమి అభివృద్ధి చేశాడంటూ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని కమాన్ పూర్ మండల బీ. ఆర్. ఎస్ నాయకులు ఏద్దేవా చేశారు
కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కమాన్ పూర్ జడ్పిటిసి గా పుట్ట మధు గెలిచి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గా గెలిచి ఏమి అభివృద్ధి చేయలేదని పార్టీ మారిన నాయకులు విమర్శించడం సిగ్గు చేటన్నారు.
నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుందన్నట్టు పార్టీ మారిన నాయకులు ఆ పార్టీ మంత్రి మెప్పు కోసమే పుట్ట మధు పై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నిన్నటిదాకా గొప్ప నాయకుడు అన్న వారు పట్టుమని పార్టీ మారి పది రోజులు గడువక ముందే మంచోడు చెడ్డోడు అయ్యిండా అని ప్రశ్నించారు. రోజు రోజుకు రాజకీయాల విలువలు నాయకుల వ్యవహార శైలితో మారుతుందన్నారు.
మంథని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు సరైనవి కాదని హేచ్చరించారు.
పుట్ట శైలజ మంథని నుండి ఎంపిటిసి గా, సర్పంచ్ గా పుట్ట మధు ఎమ్మెల్యే కాక ముందే గెలిచిన విషయాన్ని విస్మరించవద్దని హితావు పలికారు.
Pointless criticism on Putta Madhu should be avoided
కరోనా కాలంలో పుట్ట శైలజ ప్రజల ఇబ్బందుల పరిష్కారం కోసం చేసిన కృషి ఏమిటో ప్రజలకీ తెలుసునన్నారు. నిత్యం పుట్ట శైలజా, పుట్ట మధు ఇద్దరు దంపతులు మంథని నియోజకవర్గం ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటూ వస్తున్నారన్నారు.
రాజకీయాల్లో గెలువు ఓటములు సహజమని మంచి మంచి మహానేతలే ఓడినా సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు.
ఓడినా.. గెలిచినా నిత్యం మంథని నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నది మాత్రం పుట్ట మధు శైలజా దంపతులేనన్నారు.
మంథని నియోజకవర్గంలో ఒక్క ఓటు తో ఇద్దరికీ మంత్రి పదవులు వచ్చాయని.. ఒక్కటి అధికారికంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు అయితే మరొక్కటి అన్నాధికారికంగా మంత్రి సోదరుడు శ్రీను బాబు కు అని ఆరోపించారు. ఎలాంటి ప్రజాప్రతినిధి కాకున్నా పోలీస్ బందోబస్తూ తో.. మంథని నియోజకవర్గంలో మరో మంత్రిగా వ్యవహారిస్తూ పర్యటించడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని వెల్లడించారు. ఇది మంథనిలో జరుగుతున్న అధికార దుర్వినియోగం కాదా.. దీనికి మంత్రి.. ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
మంథని నియోజకవర్గంలో ప్రజలు వేసిన ఒక్క ఓటుతో ఇద్దరు మంత్రులు రాజ్యాంకుతున్న పరిస్థితి నెలకున్నాదంటే రాజ్యాంగం అమలు తీరు ఎలా ఉందో.. ఎవరికైనా ఇట్టే తెలుస్తుందాన్నారు.
Pointless criticism on Putta Madhu should be avoided
బీసీల ప్రతినిధిగా పుట్ట మధు బీసీలకు రాజ్యాధికారంలో హక్కుల కోసం పోరాటం చెందుతున్నాడని, ఎంతోమంది సమాజ హితం కోసం పోరాడిన బీసీ నేతల విగ్రహాలను నెలకొల్పి వారి చరిత్రను బావితరాలకు తెలిసేలా చేసాడన్నారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గం నుండి రాష్ట్ర స్థాయి పదవుల్లో బీసీ లకు, మైనార్టీలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేక పోయిందని ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో ఒకే ఒక్క అగ్ర వర్ణ నాయకుడికే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చి బీసీ లపై సవితి తల్లి ప్రేమను ఓలకాబోస్తుందని ఆరోపించారు. బీసీలా పట్ల ప్రేమ ఉంటే మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లా కు చెందిన వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి శక్తి వంచన లేకుండా పని చేసిన వారిని ఎందుకు మంత్రి విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మంథని మాజీ మున్సిఫల్ చైర్ ఫర్సన్ పుట్ట శైలజలపై అర్ద రహిత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీ. ఆర్. ఎస్ మండల యూత్ అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, మహిళ విభాగం మండల అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, సిద్దిపల్లె మాజీ సర్పంచ్ తాటికొండ శంకర్, బీ. ఆర్ ఎస్ నాయకులు నీలం శ్రీనివాస్, ఎలాబోయిన రామ్మూర్తి, చొప్పరి శ్రీనివాస్, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.