- Advertisement -
పోలీసు కానిస్టేబుల్ పరీక్షల తేదీ మార్పు
Police Constable Exam Date Change
విజయనగరం
జనవరి 8న జరగాల్సిన శారీరక దారుఢ్య పరీక్షలు జనవరి 11కి వాయిదా సడిందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. మార్పును గమనించాలని అభ్యర్థులకు అయన సూచించారు. స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు జనవరి 8న విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించాల్సిన పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలను జనవరి 11వ తేదీకి రాష్ట్ర పోలీసు నియామక మండలి
వాయిదా వేసినట్లుగా అయన 6న తెలిపారు. వైకుంఠ ఏకాదశి మరియు శాంతిభద్రతల పరిరక్షణ విధులను పోలీసుశాఖ నిర్వహించాల్సి ఉన్నందున పరీక్షలను జనవరి 11న
నిర్వహిస్తామన్నారు.
- Advertisement -