Friday, January 17, 2025

సిరిసిల్లలో  పోలీస్ అక్కలు

- Advertisement -

సిరిసిల్లలో  పోలీస్ అక్కలు

Police sisters in Sirisilla

కరీంనగర్ డిసెంబర్ 19, (వాయిస్ టుడే)
సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాలికలు, మహిళల భద్రత కోసం ‘పోలీస్ అక్క’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా “పోలీస్ అక్క” పేరుతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కానిస్టేబుల్ ను ఎంపిక చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు.వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల రక్షణ కోసం ‘పోలీసు అక్క’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. షీ టీమ్ కు అదనంగా ప్రతి పోలీస్ స్టేషన్ కు “పోలీస్ అక్క” పేరుతో మహిళ కానిస్టేబుల్ ఎంపిక చేశారు. వారు పొక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, మహిళ చట్టాలపై ఆవగాహన కల్పించనున్నారు.సిరిసిల్లలో షీ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన “పోలీస్ అక్కా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళ రక్షణయే దెయ్యంగా షీ టీమ్ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే “పోలీస్ అక్క” పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందన్నారు.పోలీస్ అక్కగా ఎంపిక కాబడిన వారు షీ టీమ్ కి సహాయకంగా ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు పొక్సో యాక్ట్, సెక్సువల్ హార్స్మెంట్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు వారు సంప్రదించే విధంగా షీ టీమ్, డయల్ 100, పోలీస్ అక్క నంబర్లు ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఎస్పీ మహాజన్ సూచించారు. సోషల్ మీడియాలో వేదికగా విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
ఆటకట్టిస్తున్న షీ టీమ్…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీమ్ సత్ఫలితాలు ఇస్తుందని ఎస్పీ తెలిపారు. విద్యార్థుల మహిళల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ ఈ సంవత్సరం 52 మంది ఆకతాయిలను రెండ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిపై 60 పెట్టి కేసులు, 44 FIR లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
*పిఎస్ ల వారిగా పోలీస్ అక్కలు…
సిరిసిల్ల టౌన్ – సరస్వతీ
తంగలపల్లి – సుజాత
మస్తాబాద – మంజుల
ఎల్లతకుంట  -ప్రవళిక
ఎల్లారెడ్డిపేట – రోజా
గంభీరరావుపేట. శిరీష
వీరన్నపల్లి- స్వప్న.
వేములవాడ టౌన్ లత
వేములవాడ రూరల్  – రేణుకా
బోయినపల్లి. పినాకల్ యాదవ్
చందోర్తి . శ్రీవెన్నెల
కోనారావుపేట- సంధ్య
రుద్రాంగి. జి అమల

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్