- Advertisement -
ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
Police special drive on traffic violations
సిద్దిపేట
త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, నెంబరు ప్లేట్లులేని వాహనాలపై, మరియు నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై, శుక్రవారం నాడు సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ వద్ద, ముస్తాబాద్ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యాక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు. తరువాత పోలీస్ స్టేషన్లో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. వాహన తనిఖీలలో 13 వాహనాలపై పెండింగ్ ఉన్న 32 చాలాన్లను క్లియర్ చేసి 12,500 జరిమానా డబ్బులు కట్టించారు.
నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించ వద్దని, వాహనం నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని త్రిబుల్ రైడింగ్, మరియు రాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు
- Advertisement -