-ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ఇక్కడ గెలిచేది బీజేపీ పార్టీ నే
-బిజెపి మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని
మంథని లో రాజకీయ మార్పు బీజేపీ తోనే సాధ్యమని, ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ఇక్కడ గెలిచేది మాత్రం బీజేపీ పార్టీ నేనని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బిజెపి మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.
మంథని పట్టణంలో మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ
మంథని లో రాజకీయ మార్పు జరగాలని, ఆ మార్పు బీజేపీ పార్టీ తోనే సాధ్యం అవుతుందన్నారు, ఎన్నో సహజ వనరులు ఉన్న మంథని ప్రాంతం అభివృద్ధికి అమెడ దూరంలో ఉందన్నారు. కెసిఆర్ గొప్పగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల మంథని ప్రాంతానికి జరిగిన మేలు ఏం లేదని కొద్ది రోజుల క్రితమే దాని డొల్లతనం బయటపడిందన్నారు , కార్మికులకు రైతులకు, సరైన న్యాయం జరగాలంటే బిజెపి పార్టీ మంథనిలో తప్పకుండా గెలవాలన్నారు. నాతో పాటు మూడు సంవత్సరాలుగా పార్టీ కొరకు కష్టపడుతున్న నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి మంథనిలో బిజెపి
గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, మనపై కుట్రలు కుతంత్రాలు చేసిన డిసెంబర్ మూడో మన గెలుపుతో చెంపపెట్టు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్య ప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి పోతార వేణి క్రాంతికుమార్, కొకన్వీనర్ నాంపల్లి రమేష్, మండలాల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, కోయల్ కార్ నిరంజన్, పిలుమరి సంపత్, జంగాపల్లి అజయ్, పెయ్యల కుమార్, సిరిపురం శ్రీమన్నారాయణ, ములుమురు శ్రీనివాస్, బొమ్మన భాస్కర్ రెడ్డి,ముడతనపల్లి ప్రభాకర్,బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.