Sunday, September 8, 2024

జనాభా దామాషా ప్రకారం రాజకీయ పక్షాలు కాపులకు ప్రాధాన్యతనివ్వాలి

- Advertisement -
Political parties should give preference to Kapus according to population proportion

🙏
…కాపు జేఏసీ
“జెఏసీ ఏ పార్టీ కీ అనుకులమూ కాదు వ్యతిరేకమూ కాదు..” కాపు జేఏసీ ….చందు జనార్ధన్

విజయవాడ..
బుధవారం రాష్ట్ర కాపు తెలగ బలిజ ఒంటరి  కులాల జేఏసీ అధ్వర్యంలో  విజయవాడ బందరురోడ్డు లోని అమరావతి ఫంక్షన్ హాల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది…
కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్ అధ్యక్షతన జరిగిన  ఈ సమావేశం లో రాష్ట్ర  కాపు జేఏసీ ప్రతినిధులు నాలుగువందలమంది  పాల్గొన్నారు .
ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ జేఏసీ ఏ పార్టీకి అనుకూలముగా గానీ వ్యతిరేకంగా గానీ పనిచేయదని స్పష్టత నిచ్చారు. మాకుటుంబ పెద్ద అయిన పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆయనను జేఏసీ , కాపు కులం కాపాడుకుంటుంది అన్నారు. అన్ని ప్రాంతాలలో ఉన్న మా కుటుంబ సభ్యులను కాపాడుకుంటుందని  రాష్ట్రము లో ఉన్న కుల సంఘాలను ఏక తాటి పైకి తెచ్చి సమస్యల పరిష్కారం లో ప్రధాన భూమిక వహిస్తామని అన్నారు .

ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో చర్చించిన  అనంతరం ఎనిమిది అంశాలను తీర్మానించటం జరిగిందని ,
ఈ ప్రభుత్వం తమ మేనిఫెస్టో లో  కాపు కార్పొ రేషన్ కు సంవత్సరానికి రెండు వేల కోట్లు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని ,వెంటనే ఈ అయిదు సంవత్సరాలకు
పదివేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు . సదరు నిధులను ప్రత్యేకంగా కాపు  సంక్షేమానికి ఖర్చు చేయాలని,కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఈ డబ్ల్యూ ఎస్ కోటాలో అయిదు శాతాన్ని వెంటనే అమలు చేయాలనీ
వార్డు మెంబెర్ స్థాయి నుంచి పార్లమెంట్ మెంబర్ స్థాయి వరకు దామాషా పధ్ధతి లో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనివ్వాలని , కులాల వారీగా కులగణన చేపట్టి రాష్ట్రము లో ఉన్న కాపు సామాజిక  వర్గ వాస్తవ సంఖ్యను లెక్కించి ఆ దామాషా ప్రకారం విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో అవకాశం కల్పించాలని  కోరారు అలాగే నూతన జిల్లాలలో కొన్ని జిల్లాలకు శ్రీ కృష్ణదేవరాయలు , స్వర్గీయ వంగవీటి మోహన రంగా , పెరియార్ రామస్వామి , కన్నెగంటి హనుమంతు ల పేర్లు  పెట్టాలని , ప్రతి జిల్లాలో కాపు భవనాన్ని నిర్మించాలని ప్రత్యేక నిధులు కేటాయించాలని
తీర్మానాలను జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలు చేసిందని స్పష్టం చేశారు.
రాబోయే నెల రోజుల్లో ఉత్తరాంధ్ర లో విశాఖ,రాయలసీమ ప్రాంతంలో కడప లేదా కర్నూల్ ప్రాంతీయ జేఏసీ సమావేశాలు జరుపుతామానీ చందు జనార్ధన్ ప్రకటించారు.
ఈ సమావేశం లో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ,తోట రాజీవ్ ,కిలారు రోశయ్య శాసనసభ్యులు,,వాసిరెడ్డి ఏసు దాస్, నల్లా విష్ణు, అరేటి ప్రకాష్, మంచాల సాయి సుధాకర్ నాయుడు,అమంచి సోములు,ముత్యాల రామదాసు,నీలం రాంబాబునాయుడు,దాసరి రాము,కొక్కిరాల సంజీవ్,పాలెం సురేష్,సమతం రాము,,చిన్నమి ల్లి రాయుడు,,పాకనాటి రమాదేవి, చలువాది దీపిక,నరహరి శెట్టి నరసింహారావు, మల్లిమూడి పిచ్చయ్య నాయుడు,అక్కల గాంధీ,కొప్పుల వెంకట్, ఆకులశ్రీనివాస్,బద్రి,నెలిబండ్ల రాజు, మాక శ్రీనివాసరావు,శ్రీమతి చలమలశెట్టిలక్ష్మిపార్వతి రామాంజనేయులు మరియు అల్లుడు సాంబశివరావు, కొండిశెట్టి రాజేంద్ర,పోరుమామిల్ల ఈశ్వర్, పులిగడ్డ సత్యనారాయణ, కోదండ పాని, చలువది లక్ష్మణ్ కూనపురెడ్డిరమేష్,బండ్ డ్డి రవి,ఆకుల తిరుమలరావు,వలవల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్