రైలు ఢీకొని పాలిటెక్నిక్  విద్యార్థి దుర్మరణం

- Advertisement -

రైలు ఢీకొని పాలిటెక్నిక్  విద్యార్థి దుర్మరణం

Polytechnic student dies after being hit by a train

నంద్యాల
నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీష్ అనే గిరిజన విద్యార్థి సోమవారం ఉదయం రైలు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీష్ అనే గిరిజన విద్యార్థి స్థానిక బొమ్మల సత్రం సమీపంలోని ఎస్టీ హాస్టల్ నందు ఆశ్రయం పొందుతున్నాడు. అయితే సోమవారం ఉదయం కాల కృత్యాలను తీర్చుకునేందుకు సమీప రైల్వే ట్రాక్ పై వెళ్తుండగా వెనక నుండి వచ్చిన రైలు విద్యార్థిని ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ హాస్టల్ లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో , విద్యార్థులు ఇలా బయటికి వెళ్లి ప్రమాదాలకు గురి అవుతున్నారు. హాస్టల్ నందు అత్యంత దారుణాతి దారుణంగా బాత్రూములు వంటశాలలు నిద్రించే గదులు హాస్టల్ యొక్క చుట్టుపక్కల వాతావరణం వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితిని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ కు వివిధ మాధ్యమాల ద్వారా విద్యార్థులు, విద్యార్ధి నాయకులు తమ గోడును వెలబుచ్చారు. అయితే జిల్లా సర్వోన్నత అధికారి సైతం విద్యార్థుల యొక్క బాగోగులను పట్టించుకోలేదు. విద్యార్థులు  చుట్టుపక్కల సమీప ప్రాంతాలలో కాలకృత్యాలను తీర్చుకొని వెళ్తూ ఇలా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. విద్యార్థి యొక్క విలువైన బంగారు భవిష్యత్తు రైలు ఢీకొన్న ప్రమాదంలో ముగియడం ఎంతో విషాదకరం. దీనికంతటికీ కారణం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వారి వసతి గృహాల్లో సరియైన సదుపాయాలు కల్పించకపోవడమేనని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఇటువంటి దుర్ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular