- Advertisement -
విద్య వైద్యానికి పెద్ద పీఠ-రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy, Minister of Revenue, Education and Medicine
హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లోని రెనోవా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెటిక్ రోబెటిక్ సర్జరీ యంత్రాన్ని ఆస్పత్రి ఎండి శ్రీధర్ పెద్దిరెడ్డి, ఆర్థోపెటిక్ నిపుణులు సుహాస్ మాసులోమని తో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా రూపుదిద్దుకుందని మంత్రి అన్నారు. ఇతర దేశాల రోగుల సైతం ఆధునిక వైద్య చికిత్స నిమిత్తం నగరానికి వస్తున్నారంటే ఇక్కడ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చనని అన్నారు. వ్యాపార దృక్పథంతోనే కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆధునిక రోబోటిక్ యంత్రాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మొదటి మంద శస్త్ర చికిత్సలను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ఫోర్త్ సిటీలో ప్రైవేట్ సంస్థల సైతం భాగస్వామ్యం కావాలని కోరారు. ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక వైద్య చికిత్సలు అందించే నిమిత్తం నూతన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సుహాస్ తెలిపారు.
- Advertisement -