Thursday, December 19, 2024

అమరావతిపై పొంగులేటి వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -

అమరావతిపై పొంగులేటి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponguleti's controversial comments on Amaravati

 బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇది సమిష్టిగా జరగడం లేదని కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడుతూనే ఉంది. కొంత మంది సందర్భం లేని వివాదాలను తెచ్చుకుంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పదవి కోసం పరుగులు పెడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరువులు చిట్ చాట్‌ల పేరుతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీరి ఎజెండా ఏమిటన్నదానిపై చర్చ ప్రారంభమయింది. అమరావతి విషయంలో మీడియా చిట్ చాట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు  చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఆయన అన్ని మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఈ చిట్ చాట్‌కు పిలవలేదు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది భయపడుతున్నారని పొంగులేటి చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందని చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్లు ఎంత బూస్టప్‌ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎంత తీవ్రమైన వరదలు అమరావతి మునగలేదు. బుడమేరు వల్ల విజయవాడకు ఎంత ఎఫెక్ట్ అయిందో ఖమ్మం కూ అంతే ఎఫెక్ట్ అయిందని పొంగులేటి మర్చిపోయారన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పొంగులేటి చేసిన వ్యాఖ్యల వార్తల క్లిప్పింగ్‌కు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కౌంటర్ ఇచ్చారు.  చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నాందిపలికాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుంగులు విధిగా చేసే వ్యాఖ్యలే ఇపుడు పొంగులేటి చేస్తున్నారని..  జగన్ మోహన్ రెడ్డి మిత్రత్వం వాసనలు ఇంకా పోలేదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఘాట్ లేపేసి కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుంది మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డియాతో చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు.  తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ భవనం చాలా ఓల్డ్ ది అని.. సచివాలయం కొత్తది అని తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కన ఉంటే పరిపాలనకు చాలా సులభంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశారని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ ఉద్దేశం ఏమిటన్నదానిపై కాంగ్రెస్‌లోనే చర్చ జరుగుతోంది. మరో వైపు ఏపీ పాలకులు ఎప్పుడూ హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. అక్కడి పెట్టుబడులు ఇక్కడికి వస్తాయని చెప్పలేదు. చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారు. మరి ఇప్పుడు అమరావతి గురించి ఎందుకు పొంగులేటి వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు.. ఎన్టీఆర్ ఘాట్ ను తొలగించడంపై ఎందుకు మాట్లాడుతున్నారన్నది సస్పెన్స్ గా మారింది . కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో భాగంగా వీరు సొంత పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్