- Advertisement -
టిడిపి కేంద్ర కార్యాలయంలో పూలే 134 వర్ధంతి నివాళులు
Poole 134 Tributes at TDP Central Office
మంగళగిరి,
మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు టిటిడి పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే సంఘసంస్కర్త గా ఎన్నో సేవలు అందించారు అని అన్నారు. సావిత్రిబాయి పూలే నీ విద్యావంతురాలుగా తీర్చిదిద్ది ఎంతోమంది మహిళలకు విద్యను అభ్యసింప చేశారు అని అన్నారు. దేశంలో మహిళలు సావిత్రిబాయి పూలే వల్ల విద్యను అభ్యసించి రాజకీయంగా, ఉన్నత ఉద్యోగులుగా రాణిస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం జ్యోతిరావు పూలే వలనే అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జి వి ఆంజనేయులు, శాసనమండలి సభ్యులు అశోకబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -