Monday, March 24, 2025

పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం

- Advertisement -

పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం

Poor people brand is Indiramma Rajyaam

– అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు

– జనవరి 26 నుంచి పేదోడు మెచ్చే నాలుగు హామీలు

– తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

– మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ

ఖమ్మం

పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ మల్లెమడుగు గ్రామంలో శనివారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు అందించారు. లబ్ధిదారుల కోరిక మేరకు వారి ప్లాట్లలోకి వెళ్లి పాలను పొంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పంపిణీ ప్రక్రియ మొదలైందని అన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి పట్టాలు అందించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు, గ్రామ పెద్దలు నిర్ణయం మేరకే అర్హులను గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని వారు ఎవరో రెచ్చగొట్టే మాటలు విని  అభద్రతకు లోను కావొద్దని  పేదలకు సూచించారు. మరో పదిహేను రోజుల్లో అంటే ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఇచ్చిన మాట ప్రకారం మరో నాలుగు హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. భూమి లేని రైతు కూలీలకు రెండు విడతలుగా ఏడాదికి రూ. 12వేలు ఇచ్చే కార్యక్రమం, భూమి ఉండి సాగు చేసుకునే ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ. 12 వేలు, అర్హులైన ప్రతి పేదవాడి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో పాటు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5లక్షలు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం చేకూరే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, 1వ, 59వ,60వ డివిజన్ల కార్పొరేటర్లు హుస్సేన్ , నిరంజన్, బట్టపోతుల లలితా రాణితో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్