- Advertisement -
ప్రముఖ మలయాళ నటి కన్నుమూత
May 08, 2024,
ప్రముఖ మలయాళ నటి కన్నుమూత
ప్రముఖ మలయాళ నటి కనకలత (63) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సోమవారం మరణించినట్లు తెలుస్తోంది. ఆమె డిమెన్షియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. 2021లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా, 2022లో డాక్టర్లు MRI స్కాన్ ద్వారా తనకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె వివిధ భాషల్లో 360కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -



