పోసాని … తర్వాత ఎవరు…
ఒంగోలు, మార్చి 7, (వాయిస్ టుడే )
Posani... who is next...?
కేసుల భయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారంట. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా నమోదవుతున్న కేసులతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదంటున్నారు. తాజాగా.. సినీ నటుడు, వైసీపీ నేత, బూతుల సామ్రాట్ పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు, పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలి పెట్టబోమని శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ ప్రకటించగానే పోసాని రూపంలో మరో వికెట్ పడటంతో.. నెక్ట్స్ ఎవరో అని వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారంట.మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా యాక్షన్ పార్ట్ కొనసాగుతోంది. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారిని వదిలే ప్రసక్తే లేదని.. టైం.. డేట్ కూడా రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేశ్ మండలిలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించారు. తద్వారా త్వరలో మరికొంత మంది వైసీపీ నేతలు అరెస్టు కాబోతున్నారని లోకేష్ క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో అధికారంలో ఉన్నంత కాలం ఇష్టానుసారం చెలరేగి పోయిన వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఎవరు ఎప్పుడు కటకటాల పాలుకావాల్సి వస్తుందోనని భయపడుతున్న పరిస్థితి.మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా కేసుల మీద కేసులు నమోదౌతున్నాయి. సిట్ విచారణ కొనసాగుతుంది. వంశీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సిట్ అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకుని కేసులు పెడుతున్నారు. అంతకు ముందు నమోదైన కేసుల సంగతి పక్కన పెడితే… అరెస్ట్ అయ్యాక కూడా వంశీపై వరసగా నమోదవుతున్న కేసులతో.. ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.తాజాగా.. సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మైహోం భూజా అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఇష్టానుసారం నోరు పారేసుకున్న పోసాని కృష్ణమురళీ .. రెండు నెలల క్రితం మీడియా సమావేశం పెట్టి తనకు జ్ఞానోదయం అయ్యిందనీ, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే అరెస్ట సమయంలో పోసాని పెద్ద మెలో డ్రామానే నడిపారంట. పోలీసులతో వాగ్వివాదానికి దిగి, బనీన్, నిక్కర్ మీదనే హడావుడి చేశాడు. డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినా వినకుండా ఆయన ఓవరాక్షన్ చేస్తుండటంతో.. అతి కష్టంమీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.పోసాని కృష్ణమురళి.. ఆ వ్యక్తి పేరు, భాష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నోరు తెరిస్తే బూతు పురాణం వల్లె వేశారు. పేరుకు ఆయనో సినిమా రచయిత, దర్శకుడు, నటుడు… ఆయన సినిమాల్లో నీతులు చెబుతుంటారు. కానీ మైకు దొరికితే చాలు పచ్చిబూతులతో చెలరేగిపోతారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ ప్రాపకం కోసం ఆయన ప్రెస్‌మీట్లు పెట్టి వాడిన బూతు డైలాగులు ఇప్పటికీ అందరి చెవుల్లో రీసౌండ్ ఇస్తూనే ఉంటాయి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వారి కుటుంబసభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయేవారు.వారిని ఎంతగా తిడితే జగన్ దగ్గర అన్ని మార్కులు పడతాయన్న ఉద్దేశంతో నోటికి అడ్డూ అదుపూ లేకుండా విరుచుకుపడ్డారు. పోసాని తిట్ల దండకంలో రాయడానికి వీల్లేని, అత్యంత అభ్యంతకరమైన బూతులు వినిపించేవి. మీడియా ముందు మాట్లాడుతున్నాన్న సోయ లేకుండా తనదైన హావభావాలతో తెగ చెలరేగిపోయారాయన. పోసాని ప్రెస్‌మీట్ టీవీల్లో వస్తోందంటే చిన్న పిల్లలు, ఆడపిల్లలున్న ఇళ్లలో వెంటనే ఛానల్ మార్చేయడమో, టీవీ కట్టేయడమో చేసేవారంటే ఆయన ఎంత నీచంగా మాట్లాడేవారో అర్థమవుతుంది.ఆ ఎఫెక్ట్ తోనే పోసానిపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే అధికారం వైసీపీదే కావడంతో చర్యలు లేకుండా పోయాయి. వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌తోపాటు నారా లోకేశ్ ను అసభ్యకరంగా దూషించారు. దాంతో ఏపీలోని పలు స్టేషన్‌లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన పలు సందర్భాల్లో అభ్యంతరకర భాషతో కూటమి నేతలను దూషించారు. ఇటీవల కాలంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయనపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.మొత్తంగా ఏపీ వ్యాప్తంగా పలు అంశాలపై పోసానిపై 11 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం పోసాని మీడియా సమావేశం పెట్టి తనకు జ్ఞానోదయం అయ్యిందనీ, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దీంతో కూటమి ప్రభుత్వం తనను వదిలేస్తుందని పోసాని భావించినట్లున్నారు. కానీ, బండబూతులు తిట్టి రాజకీయాలు వదిలేశానంటే కుదరదని పోలీసులు అరెస్ట్ చేసి ఆయనకు క్లారిటీ ఇచ్చారు.మండలిలో లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ తరువాత చాలా మంది వైసీపీ నేతలు రహస్య ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వంశీ అరెస్టు తరువాత ఎవర్ని అరెస్టు చేస్తారోనని వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. అయితే ముందుగా పోసాని వంతు వచ్చింది. పోసానిని అరెస్టు చేసిన తరువాత నెక్ట్స్ ఎవరు..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. .అయితే, ఈసారి పక్కాగా కొడాలి నాని అరెస్టు ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నానిపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ఆయనపై కేసులు, ప్రస్తుతం పలు స్టేషన్‌లలో ఆయనపై నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నారట.అరెస్ట్ భయంతోనే కొడాలి నాని హైదరాబాద్‌తోపాటు బెంగళూరు వంటి నగరాల్లోనే ఎక్కువగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్.. వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో జగన్ వెంట కొడాలి నాని ఉన్నాడు. మరుసటి రోజు గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లిన సమయంలోనూ కొడాలి నాని ఉన్నాడు. ఆ వెంటనే కొడాలి నాని తన అనుచరులకు కూడా చెప్పకుండా రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారంటున్నారుమొత్తమ్మీద పోసాని కృష్ణమురళి అరెస్టుతో జగన్ మళ్లీ బెంగళూరు నుంచి ఏపీకి రావాల్సిన పరిస్థితి తలెత్తిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు జగన్ బెంగళూరు ప్యాలెస్‌లోనే ఉన్నారు. అప్పట్లో జగన్ బెంగళూరు నుంచి నేరుగా నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించరు. ఇటీవలే విజయవాడ జైలుకెళ్లి వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యాడు. ప్రస్తుతం పోసాని మురళీ కృష్ణ వంతు వచ్చింది . రాజకీయాలు వదిలేసానంటున్న పోసానిపై అమితమైన ప్రేమ కురిపిస్తున్న జగన్ మళ్లీ బెంగళూరు నుంచి మళ్లీ పరామర్శకు వస్తారంటున్నారు. అదే జరిగితే మున్ముందు జగన్ మరిన్ని జైలు యాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.