ఇసుక డంపు స్వాధీనం

- Advertisement -

ఇసుక డంపు స్వాధీనం

Possession of sand dump

సిద్దిపేట
వంద  టన్నుల ఇసుక అక్రమంగా డంపు చేసి అక్కడి నుండి సప్లై చేస్తున్న దానిని సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు  మరియు సిద్దిపేట టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.
బుధవారం  ఉదయం 7 గంటల   సమయమున సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా శివ ధర్మ కంట సమీపంలో చెల్లారం వెంకట కృష్ణారెడ్డి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డంపు చేసి  అక్కడి నుండి అక్రమంగా రవాణా చేస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు సిద్దిపేట 2 టౌన్ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి  అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్  8712667445 ఆఫీసర్స్  8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular