- Advertisement -
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి వినూత్న స్వాగత పోస్టర్లు కనిపించాయి. వాట్ హపెన్నడ్ మోడీ అంటూ ఎయిర్ పోర్ట్ పరిసరా ప్రాంతాల్లో పోస్టర్లు వెలిసాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది….? పసుపు బోర్డు ఎక్కడ …..? మీ హామీలు అన్ని నీటి ముఠా లేనా అంటూ ప్లెక్సీలు కనిపించాయి. రావణాసురుడు తలతో మోడీ బ్యానర్ వుంది. ఐటిఐఆర్,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,టెక్ష్ట్స్ టైల్ పార్క్,డిఫెన్స్ కారిడార్ ,మిషన్ భగీరథ నిధులు,గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ ప్రశ్నలున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం కు వచ్చే ప్రయాణికులు పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్నారు.

- Advertisement -