ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలిసారి జైల్లో ఖైదీలకు సెక్స్ రూమ్స్

- Advertisement -

ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలిసారి జైల్లో ఖైదీలకు సెక్స్ రూమ్స్
ఇటలీ ఏప్రిల్ 19

Key decision by the Italian government.. Sex rooms for prisoners in prison for the first time

ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో   ఖైదీలకు   ‘ఏకాంత గదుల’ను (Sex Room) అందుబాటులోకి తెచ్చింది. ములాఖత్‌ సమయంలో తమ భాగస్వాములతో ఖైదీలు ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అతని పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని న్యాయస్థానం తీర్పు చెప్పింది. వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను ఆదేశించింది. యూరోపియన్ దేశాల్లో చాలా వరకూ ఖైదీల కోసం ఏకాంత గదులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.కోర్టు తీర్పుతో ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ గత వారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఖైదీలను తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అనుమతించాలని పేర్కొంది. అంతేకాదు, సదరు గదిలో మంచం, టాయిలెట్‌ వంటి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఖైదీలు తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలని పేర్కొంది.ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేల కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలే పెరిగిపోయాయి. అందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైదీల మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో శుక్రవారం నుంచి ఖైదీల కోసం మొట్టమొదటి ‘సెక్స్‌ రూమ్‌’ ప్రారంభమైంది. సెంట్రల్ ఉంబ్రియా   ప్రాంతంలోని జైలులో ఓ ఖైదీని అధికారులుఏ ‘సెక్స్‌ రూమ్‌’కు అనుమతించారు. కాగా, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌ లాంటి యూరప్‌ దేశాల్లో ఖైదీల కోసం జైల్లలో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular