అల్పపీడనం ప్రభావంలో తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టు పక్కల ప్రదేశాలు జలమయం అయ్యాయి. దర్శనానికి క్యూలైన్లలో ఉన్న భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులంతా వర్షానికి తడిసి ముద్దయ్యారు. భారీ వర్షంతో అతిథి గృహాలకు వెళ్లేందుకు భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. నిలవకుండా చిరుజల్లులు వర్షం కురుస్తుండడంతో ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద టిటిడి విజిలెన్స్ సిబ్బంది భక్తులకు సూచిస్తున్నారు. ఇక తిరుపతిలో భారీ వర్షం దంచి కొట్టింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాల కారణంగా తిరుపతి, తిరుమల నగరాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో స్థానికులతో పాటు శ్రీవారి భక్తులు సైతం గజగజ వణుకుతున్నారు.
