స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
Prepare for local body electionsహుస్నాబాద్
భారత రాష్ట్ర సమితి నాయకులకు కార్యకర్తలకు
హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పిలుపు.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
బీమదేవరపల్లి మండల కేంద్రం లో నీ వెంకటసాయి గార్డెన్ లో బీమదేవరపల్లి మండల పరిధి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని, ప్రజలకు అండగా నిలవాలని అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నాయకులంతా సమన్వయంతో పని చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు పని చేయాలని కోరారు, అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని సతీష్ కుమార్ అన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




