- Advertisement -
ధర లేక టమాట పంట అగ్గిపాలు
Price drop of tomato crop
మెదక్
టమాటాకి మార్కెట్లో ధర లేకపోవడంతో ఒక రతు పంటను తగులబెట్టాడు. శివంపేట (మం) నవాబుపేట గ్రామంలో ఘటన జరిగింది. రైతు రవి గౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా సాగు చేసాడు. మార్కెట్లో టమాట బాక్స్ 50 రూపాయలకు మించి ధర రాలేదు. కూలీల ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. వేసిన టమాటా పంట మొత్తం పీకేసి తగలబెట్టాడు. మరికొంతమంది రైతులు గిట్టుబాటు లేకపోవడంతో పంటను కోయకుండా వదిలేసారు.
- Advertisement -