ప్రధాని మోదీ , కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, బండి సంజయ్ చిత్రపటానికి పాలభిషేకం
Prime Minister Modi, Union Ministers Nirmala Sitharaman and Bandi Sanjay's picture will be anointed
దేశాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టించే బడ్జెట్
చారిత్రక బడ్జెట్
12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు
గొప్ప శుభవార్త
కోట్లాదిమందికి ఊరట నిచ్చే విషయం
బిజెపి కరీంనగర్ సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారి గాయత్రీ దేవి
కరీంనగర్ ఫిబ్రవరి 04
)కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ప్రధాని మోదీ , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారు గాయత్రి దేవి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని, వికసి త్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, దేశాన్ని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించే చారిత్రక బడ్జెట్ అని బిజెపి కరీంనగర్ సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారి గాయత్రి దేవి అన్నారు. ముఖ్యంగా రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు గొప్ప శుభవార్త లాంటిదని, కోట్లాదిమంది వేతన జీవులకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపశమనం కలిగించే శుభవార్త చెప్పారన్నారు. క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల మందులను ప్రాథమిక కస్టం డ్యూటీనుంచిమినహాయించడంతోపాటు ఆరు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై కష్టం డ్యూటీ ని ఐదు శాతానికి తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం అందుకు అవసరమైన మందులు చౌకగా ఉండేలా బడ్జెట్లో కేటాయింపులు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా ఉన్నాయని, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ధన్యవాదాలు తెలియజేసుకున్నట్టు చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా, బాధ్యులు జోన్ బాధ్యులు నాంపల్లి శ్రీనివాస్, గాజే రమేష్, అడిచర్ల రాజు, నాగసముద్రం ప్రవీణ్ , పురం హరి, పొన్నం మొండన్న , సంతోష్, భాస్కర్, మహేష్, వంశీ, మల్లికార్జున్, కన్నంబ, సతీష్, శ్రవణ్, రవి, వెంకటేష్, విజయ్ , సుమంత్, సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.